వాస్తుశాస్త్ర పరిచయము (Vāstu śāstra Parichayamu)
భారతీయ వాస్తుశాస్త్రం గృహనిర్మాణ సూత్రాలకి ఆయువుపట్టు. వేదాంగంగా ఉన్న జ్యోతిషం లో (సంహిత) భాగమైన ఈ వాస్తువిద్యను స్థాపత్యవేదము (ఉపవేదం) అని కూడా వ్యవహరిస్తారు. అద్భుతవిషయం ఏమంటే మయుడు ఖగోళం లోని నక్షత్రాలలో చుక్కల ఆధారంగా నగర నిర్మాణాలు చేపట్టి నాడు. భారతీయ సంప్రదాయాన్ని అనుసరించి ప్రతి ఇల్లు వాస్తుపురుషుని స్వరూపమే. దేవతలకి స్థపతి ఐన విశ్వకర్మ వాస్తు శాస్త్రానికి మూలా సూత్రాలు రచించాడు. అష్ఠాదశ ప్రవర్తకులతో విరాజిల్లిన ఈ శాస్త్రము భారతదేశం లోని ఆలయనిర్మాణాలకు కూడా మార్గరదర్శకమే.
Bharatiya Vāstu shastra expounds the Indic principles of architecture. A part of Jyotisha (Samhita skanda), it is one of the Vedangas. Some call it Sthapatyaveda, an Upaveda. It is intriguing to know that Mayasura, who founded the Mayan civilization, built exceptional cities based on stellar positions. According to the Bharatiya tradition, every home is the residence of the Vāstupurusha. Visvakarma, the devatasthapati, laid down the foundational principles of the Vāstu śāstra which were also used for constructing temples. Developed by 18 founding seers, in this course we discuss the far-fetching consequences and the Indic perspectives of Vāstu śāstra.
This Course is conducted in Telugu
Faculty
Introduction
Visvakarma is believed to be the creator of the Universe, as per scholarly opinions. On observation of this creation, a leaf, a flower, the human body itself is filled with inherent symmetrical constructs. Such intrinsic symmetry is the hallmark of Indian building constructions. The roof of a house is said to be the head of the Vāstupurusha, rooms are the shoulders, the windows his eyes, the main door as mouth, the walls are the heart. Our ancestors have envisioned the same principles into the construction of a residence following the symmetrical parts of the human body. It is deemed the most natural way. In nature also we find some bird-nests built in the shape of the bird itself. A bird did not study any Vāstu śāstra, it is in its intrinsic biological nature. We all have a sense of connectedness, a bonding with our house. When the tenant hits a nail into the wall, the owner of the house feels as though the nail is driven into his heart. Many enthusiastic people who regard their work or occupation highly, often express themselves by an explicit display of such themes. For example, a pilot may build a water tank in his house in the shape of an aeroplane, a Veena artist may fashion a veena structure for decoration. People in many countries have developed this science of architectural principles based on their varying necessities and beliefs. Instead of aiming to be unique or different from others, one should have a perspective of making a home as a harmonious place for relaxation and peace. Vāstu also promotes environmental protection and energy balance by the use of natural building materials.
Objectives
- Know about the history of Bharatiya Vāstu śāstra
- Understand the Indic principles of architecture
- Learn about the doshas and remedies prescribed in Vāstu śāstra
Expected Outcomes
- Appreciate the antiquity of Vāstu śāstra
- Understand the importance of Vāstu for mental and physical wellness of all beings.
- Discern common misconceptions about Vāstu.
Beneficiaries
- Students and Researchers of architecture and astrology
- Purohits, Vāstu consultants and practitioners
- Homemakers and those interested in learning this subject
Syllabus
- Introduction of Vāstu (Origin of concept and the word Vāstu , Texts where Vaastu concept first appeared, Story about Vāstu Purusha, Components of Vāstu such as directions, Importance of Vāstu) (3 hours)
- Development of Vāstu śāstra in the India and other countries (Vedangas, Upaveda-Sthapatyaveda, Vāstu in Puranas and Itihasa, Vāstu as a śāstra, Vāstu Pravartakas) (3 hours)
- Four kinds of Vāstu – Bhu, Harmya, Yaana, Shayana. Devalaya Vāstu . Additionally, in modern times its applications in Sabha bhavana, Offices, Police stations, Factories, Cinema halls, Kalyana mandapas, Nagara Vāstu . (3 hours)
- Grhavaastu General Rules – Bhupariksha, Sakunas, Diksaadhana, Ashtadikplava, Shankusthapana – Methods and suitable time, Unsuitable time for constructing a house, Vāstu specific to a person’s Jatakam, Ekaasheetipada Vāstu, Shodasapada Vāstu, Aayaganita, Navavarga sadhana, Shodasha gruhanirmanam, Chatusshaaladi nirmanam (9 hours)
- General Vāstu doshas and remedies (8 hours)
- Gruhapravesha Procedures – Muhurtam, suitable time according to jataka (3 hours)
- Misconceptions and facts (1.5 hours)
పరిచయం
విశ్వకర్మ అంటే విశ్వాన్ని సృష్టించిన వాడు అనే భావన ప్రచారం లో ఉంది. విశ్వంలో ప్రతి అంశం లోను, ఒక ఆకు, ఒక పువ్వు, మానవ శరీరం తో సహా, పూర్వా పరాల సారూప్యం (సిమ్మెట్రీ) గోచరిస్తుంది. ఆ సారూప్యమే భారతీయ గృహనిర్మాణాలలో ప్రాధాన్యం వహిస్తుంది. గృహం యొక్క కప్పు వాస్తు పురుషుని శిరస్సు అని, వసారాలు బాహువులని, కిటికీలు కళ్ళు, ముఖద్వారం ముఖమని, గోడ వక్షస్థలమని చెప్పబడింది. మానవశరీరనిర్మాణమునకు తగిన రీతిలో గృహనిర్మాణమునకు మనవారు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది ప్రకృతి సహజం. ప్రకృతి లో కొన్ని పక్షిగూళ్ళు పక్షి ఆకారమే కలిగి ఉండడం మనం చూడవచ్చు. అది వాస్తు శాస్త్రం చదువుకోలేదు. దానికావాస్తు సహజవిద్యే. గృహమునందు ఆత్మీయత కావలి. అద్దెకు ఉన్నవాడు గోడకి మేకులు కొడితే నా గుండెలమీద కొట్టినట్టే ఉంది అంటాడు యజమాని. వృత్తిని ప్రేమించే కొందరు పైలోట్స్ ఇంటిపైన వాటర్ ట్యాంక్ కి విమానాకారాన్ని, వైణికుడు ఇంటిపైన వీణాకృతినినిర్మించుకోడం లో ఈ ఆత్మీయత గోచరిస్తుంది. దేశవిదేశాలలో వారి వారి అవసరాలకు అనుగుణంగా వాస్తువిద్య వృద్ధి చెందింది. ప్రక్రుతి సహజమైన ప్రశాంతికరమైన నిర్మాణాలను ప్రోత్సహించడమే వాస్తు శాస్త్రముయొక్క ముఖ్య ఉద్దేశం.
పాఠ్యాంశాలు
- వాస్తుపరిచయం (వాస్తు పదం మరియు ఉద్ధేశం యొక్క ఉత్పత్తి, ప్రథమం గా వాస్తు విషయప్రసంగం, వాస్తుపురుషుని గాథ, వాస్తులో ఉన్న అంశాలు దిక్కులు లాంటివి, ప్రాముఖ్యత) (3 ఘంటలు)
- వాస్తు శాస్త్ర విస్తారం భారతదేశం లోను మరియు ఇతరదేశాలలో (జ్యోతిషం లో భాగం, ఉపవేదం-స్థాపత్యవేదం, పురాణం మరియు ఇతిహాస అంశాలు, వాస్తు శాస్త్రం గా అభివృద్ధి, ప్రవర్తకులు) (3 ఘంటలు)
- నాలుగు రకాల వాస్తు – భూ, హర్మ్య, యాన, శయన. దేవాలయ వాస్తు గురించి పరిచయం. ఆధునిక అంశాలలో వాస్తు ఆవశ్యకత – సభా భవననిర్మాణాలు, వివిధ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్స్, కర్మాగారాలు, సినిమా హాల్స్, కల్యాణ మండపాలు, నగర వాస్తు. (3 ఘంటలు)
- గృహవాస్తు సాధారణ నియమాలు – భూపరీక్ష (ప్రక్షిప్తాలు), శకునములు, దిక్సాధన, అష్టదిక్ప్లవాలూ, శంకుస్థాపన -విధానం, సమయము, గృహుహనిర్మాణంకి విడువవలసిన కాలం, జాతకం తో సమన్వయము, ఏకాశీతిపద వాస్తు, షోడశపద వాస్తు, ఆయగణిత, నావవర్గసాధన, షోడశ గృహనిర్మాణం, చతుశ్శాలాది నిర్మాణం (9 ఘంటలు)
- సామాన్యవాస్తు దోషాలు, నివారణచర్యలు (8 ఘంటలు)
- గృహప్రవేశ విధానం, ముహూర్తం, సమయం (3 ఘంటలు)
- భ్రమలు వాస్తవాలు (1.5 ఘంటలు)