Ashtaka-Varga: A Study in Phalita Jyotisha
Ashtaka-varga is one of the important but lesser explored aspects in Predictive Astrology. Knowledge of Astaka-varga brings clarity about the Bhavabalas thereby increasing the accuracy of the predictions. It is a unique feature to a person’s natal chart. A person can properly utilize his time, money and efforts by pursuing his strengths as determined by the study of Ashtaka-varga in his horoscope.
Introduction
Ashtaka-varga is a unique system that greatly enhances the accuracy of predicting results in a person’s native chart.
अष्टकवर्गं विना दशाफलम् न वक्तव्यम् – पृथुयशस्
सूक्ष्माष्टकवर्गसंशुद्धिः स्थूला शुद्धिस्तु गोचरे – राजमार्तंडः
Prthuyasassu (Varahamihira’s Son) has laid down that Dasaphalam should not be reported without the study of Ashtaka-varga results. Rajamartamda states that the strengths of grahas can be known in general by assessing their movements (grahacharam) whereas specific strengths can be assessed by knowing the Ashtaka-varga. However, more than 90% of Jyotisha Pandits are giving out chart predictions without assessing the Ashtakavarga values in a native’s chart. Ashtaka-varga is an essential part of Phalita Jyotisha. For example, the seven and half year Shani period (Gochara) starts at the same time for all people in a rashi, but the results experienced are different for each person. It should be noted that the reason for such differences can be known from Ashtaka-varga study only. So also Ashtaka-varga study is the only way to show, with reasoning, as to why a few aspects are good and few are bad in one dasa period.
Objectives
- Understand definition of Ashtakavarga
- Understand the difference in the analysis of a horoscope with and without the Ashtakavarga values in a chart.
Beneficiaries
- Students of Astrology (Astrology and Social Sciences)
- Practicing Astrologers
- Practicing Purohits
Expected Outcomes
- Create and spread awareness about the use of Ashtaka-varga in Predictive Astrology
- Learn about calculating Astaka-varga in a natal chart
- Learn application of Astaka-varga in increasing the correctness of predictions
ఫలితజ్యోతిషం లో అష్టక-వర్గు అధ్యయనం
అష్టకవర్గం వినా దశాఫలమ్ న వక్తవ్యమ్ – పృథుయశస్సు
సూక్ష్మాష్టకవర్గసంశుద్ధిః స్థూలా శుద్ధిస్తు గోచరే – రాజమార్తండః
అష్టక-వర్గు లేకుండా దశా ఫలం చెప్పకూడదు అని పృథుయశస్సు (వరాహమిహిరుని కుమారుడు) తెలిపాడు. గ్రహచారం వలన తెలిసే బలం స్థూల మైనది. అష్టక-వర్గు ద్వారా తెలిసే బలం సూక్ష్మమైనది. కానీ అష్టక-వర్గు చూడకుండానే 90% జ్యోతిష్య శాస్త్రజ్ఞులు ఫలితాలు చెబుతున్నారు. ఆ కారణమున అష్టక-వర్గు ఫల విచారణ జ్యోతిష విద్యార్థులకు పరిచయం చేసే ఉద్దేశంతో ఈ కోర్సు నేర్పుతున్నాము. ఇది అత్యవసరమైన ఫలిత జ్యోతిషాంశం. గోచారంలో ఒక రాశి వారికి అందరికీ ఏలినాటి శని ఒకసారి ప్రారంభమైనా ఫలితాలు ఒకలాగా ఉండవు. ఆ మార్పులకు కారణాలు అష్టక-వర్గు లోనే గోచరిస్తాయి. ఒక దశలో కొన్ని విషయాలు బాగుండటం కొన్ని విషయాలు బాగుండకపోవటం అనే విభజనకు సహేతుక వివరణ అష్టక-వర్గు మాత్రమే ఇవ్వగలదు, వేరే ఏ విధానము ఇవ్వలేదు. వ్యక్తి తన శ్రమ, కాలము, ధనము వ్యర్థం కాకుండా రాణించే విషయాలలోనే తన శ్రమను వినియోగించడానికి అష్టక-వర్గు ఉపయోగపడుతుంది.
అధ్యయనాంశాలు – Syllabus
- అష్టక-వర్గు – ప్రయోజనం (Ashtaka-varga – Purpose)
- జ్యోతిషాంశాల పారిభాషిక పద వివరణ (Explanation of Jyotisha Terminology)
- అష్టక-వర్గు చక్ర నిర్మాణం (Ashtaka-varga Chakra Preparation)
- రాశిచక్ర నిర్మాణం (Rashi Chakra Preparation)
- త్రికోణ శోధన – ప్రయోజనం (Tikona Shodhana – Purpose)
- ఏక ఆధిపత్య – శోధన ప్రయోజనం (Ekadhipatya Shodhana – Purpose)
- భావబల నిరూపణ (Bhavabala Determination)
- భావాలు పోలికలు (Bhavas – Similarities)
- దశలు -అష్టక-వర్గు (Dasas – Ashtaka-varga)
- గోచారం అష్టక-వర్గు (Gochara – Ashtaka-varga)